![]() |
![]() |

పఠాన్, జవాన్, డంకీ వంటి వరుస హిట్స్ తో తనని 'బాలీవుడ్ బాద్షా' అని ఎందుకు అంటారో షారుఖ్ మరోసారి చాటి చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పఠాన్, జవాన్ అయితే కలెక్షన్స్ పరంగా బాలీవుడ్ లో సరికొత్త రికార్డులు కూడా సృష్టించాయి. ఈ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో సుమారు మూడు సంవత్సరాలు తర్వాత షారుఖ్ 'కింగ్'(King)అనే మూవీ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా షారుక్ పై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారని, ఒక సన్నివేశంలో షారుఖ్ డూప్ లేకుండా క్లిష్ట తరమైన స్టంట్ చెయ్యడంతో గాయాలు పాలయినట్టుగా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తుంది. కొన్ని ఇంగ్లీష్ మీడియా ఛానల్స్ లో అయితే, అత్యవసర చికిత్స కోసం షారుక్ ని అమెరికా తీసుకెళ్లినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో కింగ్ షూటింగ్ సెప్టెంబర్ కి వాయిదా పడే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. అయితే షారుక్ కి తగిలిన గాయాల విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కండరాలు పట్టాయని సన్నిహిత వర్గాల వారు చెప్తున్నట్ట్టుగా టాక్.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'కింగ్' ని 'సిద్దార్ధ్ ఆనంద్' తెరకెక్కిస్తున్నాడు. షారుఖ్ ని వరుస ప్లాప్ ల నుంచి బయటపడేసిన పఠాన్ కి కూడా సిద్దార్ధ్ ఆనంద్(Siddharth Anand) దర్శకుడు కావడంతో, కింగ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షారుఖ్ సరసన రాణి ముఖర్జీ జత కడుతుండగా, షారుక్ కుమార్తె సుహానా(Suhana Khan)సిల్వర్ స్క్రీన్ పై కూడా షారుక్ కి కూతురుగా ఈ చిత్రంలో చేస్తుంది. దీంతో ఈ చిత్ర కథ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. దీపికా పదుకునే(Deepika Padukune),అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)కూడా కింగ్ లో కథకి ప్రాధాన్యత గల పాత్రలని పోషిస్తున్నారనే టాక్ కూడా ఉంది.
![]() |
![]() |